ఆకేరు న్యూస్, కమలాపూర్: మండలంలోని ఉప్పల్ గ్రామంలో శనివారం సైబర్ మోసాలు, ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించేందుకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు నాబార్డ్ వారి ఆర్థిక సహాయముతో రాజమహేంద్రవరం విభూతి బ్రదర్స్ కళాజాత బృందం వారిచే ప్రజలకు బ్యాంకు స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 436, ప్రధానమంత్రి సురక్ష 20 రూపాయలు, అటల్ పెన్షన్ యోజన పథకం, ఎన్పీఎస్, వాత్సల్య , ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ పథకాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ మోసాల నుండి జాగ్రత్తలు వహించి లాటరీ వచ్చింది, మీ బ్యాంకులో డబ్బులు జమ అయ్యాయని ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పకూడదని, డిజిటల్ అరెస్టులు నమ్మవద్దని, ఏపీకే ఫైల్స్ బ్లూ రంగులో ఉండే యాప్ ను ప్రెస్ చేయవద్దని, ఆన్లైన్ యాప్ లను డౌన్లోడ్ చేయవద్దని తెలియజేస్తూ కళాకారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఎస్ వెంకటేశ్వర్లు, అకౌంటెంట్ శ్రవణ్ కుమార్, ఎఫ్ఓ కళ్యాణ్ చక్రవర్తి, క్యాషియర్లు రవి, పవన్, టీపీఎస్ నరేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
