* ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: ప్రత్యేక రాష్ట్ర సాధన తో తెలంగాణ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను టచ్ చేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కెసిఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆదివారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలోని శివాజీ సెంటర్ నుండి బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వరకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి పోచారం మాట్లాడుతూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ నాటకం ఆడుతుందని అందులో భాగంగానే కెసిఆర్ కు సిట్ నోటీసులు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దయవల్ల ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకొని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు భరోసా, కెసిఆర్ కిట్టు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే అనేక ప్రాజెక్టులను కట్టించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దేవుడని కెసిఆర్ ను కొనియాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ కార్యకర్త నుంచి మొదలు కెసిఆర్ వరకు ఎవరిని టచ్ చేసిన కేసులు బనాయించిన రెండున్నర ఏళ్ల తర్వాత కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీకి వడ్డీ వసూలు చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి వయసుకు గౌరవం ఇస్తున్నామని స్థాయి దిగజారి మాట్లాడితే చిన్న వయసున్న మేం మాట్లాడితే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటాడు అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ నుంచి గెలిచానని చెప్పి కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికైనా తన పదవికి రాజీనామా చేసి గౌరవాన్ని కాపాడుకోవాలని కోరారు.
” డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలి..
ఎమ్మెల్యే రాజయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి విచారణ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అవి మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కోరారు. ప్రత్యేక రాష్ట్ర సాధన తో పాటు రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కెసిఆర్ పై కేసులు మోపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. ఆంధ్ర సీఎం చంద్రబాబు చెప్పు చేతుల్లో ముందుకు నడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపొ మాపో టిడిపిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని రాజయ్య ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిత్తులు చిత్తులు వేసిన మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎడవల్లి కృష్ణారెడ్డి, చిల్పూర్ ఇంచార్జ్ మాలోత్ రమేష్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఆకుల కుమార్, మారపాక రవి, అక్కనపల్లి బాలరాజు, ఏలియా, మారుపల్లి ప్రసాద్, తాటికొండ సురేష్, కనకం గణేష్, ఒగ్గు రాజు, ఉడుగుల భాగ్యలక్ష్మి, పావని, రమ, జ్యోతి, కవిత, కవిత, చిట్టిబాబు, కుంభం కుమార్, హిరసింగ్, రాజేష్, రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని టిఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేసే ప్రయత్నం చేయగా ఏసీపీ బీమ్ శర్మ, సిఐ వేణు ఎస్సైలు వినయ్ కుమార్, రాజేష్ ల ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. చిల్పూర్ మండల కేంద్రంలో ఇంచార్జ్ మాలోత్ రమేష్ నాయక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

………………………………………………………….
