ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని జయ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో 1986-87 తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్మేళనం అహల్లాదకర వాతావరణంలో ఆదివారం జరిగింది. 39 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆ పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, యోగక్షేమాలు తెలుసుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పార్శి రంగారావు, నిమ్మ త్రివేణిల పర్యవేక్షణలో 55 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నెల్లుట్ల సునీత, శారద, శోభారాణి, మహేశ్వరి, మంజుల, కిషోర్, రవి, శ్రీనివాస్, విద్యాసాగర్ రెడ్డి, విష్ణు, లింగారెడ్డి, రాజయ్య, సర్వర్ పాషా, రాం నారాయణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
