* మేడారంలో ముగిసిన సమ్మక్క-సారలమ్మ ఉత్సవాలు…
ఆకేరు న్యూస్, ములుగు:మేడారం జాతర అనంతరం నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాల్లో భాగంగా 4న తిరుగువారం పండుగ ఘనంగా నిర్వహించనున్నారు. మేడారం మరియు కన్నెపల్లిలోని వన దేవతల ఆలయాల్లో ఈ నెల 4వ తిరుగువారం పండుగ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. మహా జాతర ముగిసిన తర్వాత వచ్చేవారం నిర్వహించే ఈ తిరుగువారం వేడుకల్లో భాగంగా, ఈ నెల 4న పూజలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేయనున్నారు. ఉత్సవాల నిర్వహణలో ఏవైనా పొరపాట్లు లేదా లోటుపాట్లు జరిగి ఉంటే క్షమించాలని కోరుతూ పూజారులు దేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించారు.జాతర మరియు తదుపరి కార్యక్రమాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయినందుకు దేవతలకు కృతజ్ఞతలు తెలిపారు. జాతర వేడుకలకు పూజారులతో పాటు వారి బంధుమిత్రులు, గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
