ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: రాష్ట్ర స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ కు జనగామ జిల్లా శివునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక అయ్యారు. జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ చూపిన పదవ తరగతి (తెలుగు మీడియం) విద్యార్థులు బోయిని రామ్ చరణ్, మొదటి బహుమతిగా 3 వేలు, ప్రశంసా పత్రం , మెమెంటో. కోలా శిరీష తృతీయ బహుమతిగా 1000, ప్రశంసా పత్రం, మెమెంటో జిల్లా అధికారుల నుండి అందుకున్నారు. ఈనెల 7న హైదరాబాద్ హయత్ నగర్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో వీరు పాల్గొనబోతున్నారు . రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను మంగళవారం కాంప్లెక్స్ హెచ్ఎం రమేష్, ఏఏపీసి చైర్మన్ రాధిక, ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, శ్రీ నికాంత్, రవి, వసంతకుమారి, లక్ష్మీ ప్రసాద్, శ్రీనాథ్, యాదగిరి, కృష్ణవేణి, సర్వర్ పాషా, శ్రీదేవి, సురేఖ, పకీర్ దాస్, నళిని బాయ్, రాధాకృష్ణ, రజిని, శర్మ, జ్యోతి జానకి, ఉమారాణి, రవి, సిఆర్పి వెంకటేశ్వర్లు తదితరులు అభినందించారు.
……………………………………………….
