* గాయపడిన హోంగార్డుకు అండగా సీపీ!!
ఆకేరు న్యూస్,హన్మకొండ: ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ట్రాఫిక్ హోంగార్డుకు పోలీస్ కమిషనర్ (CP)సీతారెడ్డి స్వయంగా వెళ్లి ఆర్థిక సహాయం అందజేసి భరోసానిచ్చారు.హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న శ్యామ్ బాబు, ఇటీవల తన నివాసంపై నుండి ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన వెన్నుపూస మరియు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న సీపీ సీతారెడ్డి మంగళవారం ఆసుపత్రిని సందర్శించారు. శ్యామ్ బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, బాధితుడికి తోటి సిబ్బంది మరియు అధికారుల తరపున సేకరించిన రూ. 50,000 నగదును వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు.పోలీస్ అధికారుల చొరవను చూసి స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం కూడా తమ వంతు సాయం ప్రకటించింది. సీపీ తో జరిపిన చర్చల అనంతరం, శ్యామ్ బాబు వైద్య బిల్లులో రూ. 45,000 వరకు రాయితీ కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించింది.ఈ కార్యక్రమంలో సీపీ వెంట ఏసీపీ, ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కష్ట కాలంలో అండగా నిలిచిన పై అధికారులకు, తోటి సిబ్బందికి శ్యామ్ బాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
……………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
