ఆకేరు న్యూస్, హనుమకొండ : పుట్టెడు దు:ఖం లో ఉన్న ఆ కుటుంబంలో మరో దారుణం జరిగింది. రాజిడి వెంకట రాజా నర్సింహా రెడ్డి తల్లి కొంత కాలం క్రితం మరణించింది. తల్లికి పిండ ప్రధానం చేసేందుకు హనుమకొండ లోని గుండ్లసింగారం ఎస్సారెస్పీ కెనాల్ కు వెళ్లారు. కెనాల్ లోకి దిగి తల్లికి పిండ ప్రదానం చేసే ప్రయత్నం చేస్తుండగా పట్టు తప్పి పడిపోయారు. అప్పటికే కెనాల్ ప్రవాహం భారీ గా ఉండడంతో నర్సింహరెడ్డి అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయారు.. సమాచారం అందుకున్న మంగళవారం కేయూ సీఐ రవికుమార్, పోలీసు సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ తో కలిసి ఎస్సారెస్పీ కెనాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గీసుగొండ మండలంలోని మొగిలిచర్ల గ్రామ శివారు కాలువలో మృతదేహం గుర్తించారు. ఎంజీఎంలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు కేయూ సీఐరవికుమార్ తెలిపారు..
————————————————-
