Telangana Cabinet promotes seven fine rice varieties
* మిగులు ధాన్యం ఈ-వేలం – రూ. 2389 బేసిక్ ప్రైస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.
* వానాకాలంలో సన్న ధాన్యానికే ప్రాధాన్యత..
రాబోయే వానాకాలం పంట కాలంలో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఏడు రకాల సన్న ధాన్యాన్ని మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం రైతులను కోరుతోంది. రైతులు సన్న రకాలు సాగు చేయడం వల్ల లాభాలు పొందుతారని, దీనిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖను మంత్రివర్గం ఆదేశించింది.
* ధాన్యం సేకరణలో రికార్డు – మిగులు ధాన్యం వేలం..
యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రికార్డు స్థాయిలో 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇందులో కేవలం 63.62 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే సేకరిస్తోంది. మిగిలిపోయిన 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించాల్సి ఉంది.
* ఈ-వేలం ద్వారా విక్రయాలు..
ఇటీవల మొక్కజొన్న వేలం ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం లభించిన నేపథ్యంలో, ఈ మిగులు ధాన్యాన్ని కూడా పారదర్శకంగా విక్రయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ధాన్యం క్వింటాలుకు రూ. 2,389 బేసిక్ ప్రైస్‌గా నిర్ణయించి, ఈ-వేలం (e-Auction) ద్వారా విక్రయించాలని మంత్రివర్గం తీర్మానించింది. రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే, ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని మంత్రులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
