Khanapur Crocodile Hatchling
* పాకాల వాగు పరిసరాల్లో రైతులకు అధికారుల హెచ్చరిక
ఆకేరు న్యూస్, ఖానాపురం:
ఖానాపురం మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. స్థానిక రైతు మర్రి విజయ్ తన పొలాన్ని దున్నుతుండగా అకస్మాత్తుగా ఒక మొసలి పిల్ల కనిపింంచింది. పొలంలో మొసలి పిల్లను చూసిన రైతు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
పాకాల వాగు సమీపంలోనే ఈ పొలం ఉండటంతో, తరచూ నీటి వనరుల నుండి మొసళ్లు ఇక్కడికి సంచరిస్తుంటాయని స్థానిక రైతులు తెలిపారు. కాగా, పొలం దున్నుతున్న సమయంలో దుక్కి యంత్రం కింద పడి ఆ మొసలి పిల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు విజయ్ పేర్కొన్నారు.
ఈ ఘటనతో పాకాల వాగు పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నీటి వనరుల సమీపంలోని పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, కూలీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగు పరిసరాల్లో మొసళ్ల సంచారంపై సమాచారం ఉంటే వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
