మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజన!!
హైదరాబాద్ మహానగర పాలనను మరింత వేగవంతం చేసేందుకు మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని ప్రభుత్వం మూడు స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ,సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ,మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ …..సైబరాబాద్ తొలి కమిషనర్‌గా IAS Dr.సృజన నగరంలోని అత్యంత కీలకమైన ఐటీ కారిడార్ మరియు పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి Dr.సృజన బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు. ఇకపై ఐటీ హబ్‌లో ట్రాఫిక్ సమస్యలు, వ్యర్థాల నిర్వహణ మరియు మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి సవాళ్లపై సృజన దృష్టి సారించనున్నారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి Dr.సృజన తన పనితీరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె గతంలో విశాఖపట్నం (GVMC)కమిషనర్‌గా, కర్నూలు మరియు ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్‌గా సేవలందించారు. కోవిడ్ సమయంలో ఆమె బాలింతగా ఉండి కూడా, కేవలం 22 రోజుల్లోనే తిరిగి విధుల్లోకి చేరి తన కర్తవ్యాన్ని నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
