అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి..
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 16వ వార్డులోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె, సామాన్య పౌరురాలిగా క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
