*గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసిన కేంద్రం….
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా రాష్ట్రానికి మరో రూ.387 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి పనుల కోసం ఈ నిధులను కేటాయించారు. కేంద్రం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది.ఇప్పటికే మొదటి విడతగా రూ.259.36 కోట్లు రాష్ట్రానికి అందాయి.మొత్తం నిధులు తాజా విడుదలతో కలిపి ఇప్పటివరకు తెలంగాణ పంచాయతీలకు మొత్తం రూ.646.36 కోట్లు అందినట్లయింది. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం కోటా కింద దాదాపు రూ.3,000 కోట్లు ఇంకా రావాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం మరియు కేంద్రం కోరిన వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సమర్పించడంతో ఈ నిధులు దశలవారీగా విడుదలవుతున్నాయి. ఇంకా రావాల్సిన సుమారు రూ.2,400 కోట్ల పెండింగ్ నిధులను కూడా తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నిధులు అందితే గ్రామాల్లో పెండింగ్లో ఉన్న డ్రైనేజీలు, రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులకు ఊతం లభించనుంది.
