*అల్లరి చేస్తున్నాడని బాలుడి కన్ను పోయేలా కొట్టిన అంగన్వాడీ టీచర్!!
ఆకేరు న్యూస్ , రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తమ కుమారుడు విద్వాన్ష్ను అంగన్వాడీ కేంద్రంలో వదిలేసి తమ రోజువారి పనులు చేసుకునేందుకు వెళ్లిన కొంపెల్లి లక్ష్మీ, విజయ్ కుమార్ దంపతులు. అయితే కొద్దిసేపటికి తమ కుమారుడికి జ్వరం వచ్చిందని, ఇంటికి తీసుకెళ్లాలని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన అంగన్వాడీ టీచర్ రాణి.అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చూసేసరికి, ఒకసారి గా తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. బాలుడి కంటికి, చేతులకు తీవ్ర గాయాలు ఉండడం గమనించి, చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అంగన్వాడి టీచర్ ని ప్రశ్నించగా నాకేం తెలియదని సమాధానం ఇవ్వడంతో, బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు అంగన్వాడీ టీచర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
