*కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య
ఆకేరు న్యూస్, డేస్క్: సినిమా కథలు వినడానికి వింతగా ఉన్నా, అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి ఘటనలే ఎదురవుతుంటాయి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వచ్చిన ‘శుభలగ్నం’ సినిమాలో ఆస్తి కోసం భర్తను మరో మహిళకు అమ్మేసే భార్య పాత్రను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెలుగుచూసింది. భోపాల్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి, 52 ఏళ్ల మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తన భర్తను మార్చుకోవాలని ఆమె ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కింది.కోర్టు సూచనల మేరకు ఇరు పక్షాలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, సదరు భర్త మాత్రం తన ప్రియురాలితోనే ఉంటానని, భార్యతో కలిసి ఉండటం తనకు ఇష్టం లేదని ఖరాకండిగా చెప్పేశాడు. దీంతో భార్య ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తన భర్తను వదిలేయడానికి భారీ ‘డీల్’ సెట్ చేసింది.రూ. 1.5 కోట్లు (భర్తను వదిలేందుకు).మరో రూ. 27 లక్షలు. ఒక సొంత ఇల్లు కూడా భార్య పేరిట ఉండాలి భార్య చేసిన డిమాండ్లకు అంగీకరించిన భర్త..తన భర్త తనతో ఉండనప్పుడు, తన భవిష్యత్తు కోసం ఆస్తిని తీసుకోవడమే ఉత్తమమని భావించిన భార్య డిమాండ్లకు భర్త కూడా తలొగ్గాడు. ప్రియురాలి కోరిక మేరకు ఆమె ఆస్తిని ఇచ్చేందుకు భర్త అంగీకరించడంతో, కోర్టు ఈ వింత ఒప్పందాన్ని అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
