* మెరిసిన 20 మంది రాష్ట్ర ఆణిముత్యాలు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్: దేశంలోనే అత్యున్నతమైన కేంద్ర సర్వీసుల పరీక్ష యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్-2025 ఫలితాల్లో తెలంగాణ బిడ్డలు తమ సత్తా చాటారు. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపిస్తూ.. రాష్ట్రం నుంచి సుమారు 20 మంది అభ్యర్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఐఏఎస్ (IAS), ఐపిఎస్ (IPS) వంటి ప్రతిష్టాత్మక సర్వీసులకు ఎంపికయ్యారు.
రాష్ట్ర టాపర్‌గా గుడెల్లి సృజన:
ఈ ఫలితాల్లో మహిళా అభ్యర్థుల హవా స్పష్టంగా కనిపించింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన ఆల్ ఇండియా లెవల్లో 55వ ర్యాంకు సాధించి రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆమె డీఎస్పీగా శిక్షణ పొందుతూనే, తన ఐఏఎస్ కలను నిజం చేసుకోవడం విశేషం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ లక్ష్మీ రచన (178వ ర్యాంక్), మేడ్చల్ జిల్లాకు చెందిన ప్రీతి రాపర్తి (468వ ర్యాంక్) వంటి వారు నేటి తరం యువతులకు రోల్ మోడల్స్‌గా నిలిచారు.
విజేతల పూర్తి జాబితా: ర్యాంకులు – జిల్లాల వారీగా:
తెలంగాణ గడ్డపై పుట్టి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆ 20 మంది విజేతలు వీరే…
గుడెల్లి సృజన (55) – పెద్దపల్లి
అట్ల తరుణ్ తేజ (123) – వరంగల్ అర్బన్
బానోత్ లక్ష్మీ రచన (178) – రంగారెడ్డి
ఎం. వెంకటేష్ ప్రసాద్ సాగర్ (358) – మహబూబ్ నగర్
మెరుగు కౌశిక్ (399) – మేడ్చల్ మల్కాజిగిరి
ప్రీతి రాపర్తి (468) – మేడ్చల్ మల్కాజిగిరి
విక్రమ్ బెత్తి (472) – వరంగల్ అర్బన్
యశ్వంత్ ఎస్ (475) – నల్గొండ
విక్రమ్ సింహ రెడ్డి వి (541) – రంగారెడ్డి
ఆశిష్ అనిశెట్టి (676) – వరంగల్ అర్బన్
విజయ్ సింహ రెడ్డి (682) – రంగారెడ్డి
అంగరాజు నవీన్ (715) – సూర్యాపేట
వి. ప్రణీత్ గౌడ్ (718) – కామారెడ్డి
మున్వర్ ఖాన్ (740) – నిజామాబాద్
పుదారి రాహుల్ (748) – జగిత్యాల
దైనంపల్లి ప్రవీణ్ (793) – ములుగు
ఎస్లవత్ శ్రీరామ్ హర్ష (823) – రంగారెడ్డి
జైహింద్ కిషోర్ (831) – మేడ్చల్ మల్కాజిగిరి
జి. నితీష్ (889) – మేడ్చల్ మల్కాజిగిరి
జీతేందర్ నాయక్ (939) – జయశంకర్ భూపాలపల్లి
జిల్లాల వారీగా విజయకేతనం:
వరంగల్ జోరు: ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అత్యధికంగా అభ్యర్థులు ఎంపికయ్యారు. అట్ల తరుణ్ తేజ, విక్రమ్ బెత్తి, ఆశిష్ అనిశెట్టి అద్భుత ప్రతిభ కనబరిచారు.
హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో ఎక్కువ :
ఈ జిల్లాల నుండి కూడా భారీ సంఖ్యలో అభ్యర్థులు విజయం సాధించి రాష్ట్ర రాజధాని పరిసర ప్రాంతాల పట్టును నిరూపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన జీతేందర్ నాయక్, ములుగు జిల్లాకు చెందిన దైనంపల్లి ప్రవీణ్ వంటి వారు ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ ఘనత సాధించడం గమనార్హం. కఠిన శ్రమే లక్ష్యం వైపు నడిపింది ఈ విజేతల వెనుక ఎన్నో త్యాగాలు, కఠిన శ్రమ దాగి ఉన్నాయి. కొందరు ఇప్పటికే చిన్న ఉద్యోగాలు చేస్తూ చదవగా, మరికొందరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి రాత్రింబవళ్లు శ్రమించారు. ఈ జాబితాలో అన్ని సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులు ఉండటం సామాజిక మార్పుకు ఒక శుభసూచకం.
కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవాలి…
చేసుకోవడానికి నిరంతర కృషి అవసరమని ఈ 20 మంది విజేతలు నిరూపించారు. వీరందరూ ఇప్పుడు దేశ పరిపాలనలో కీలక పాత్ర పోషించబోతున్నారు. తెలంగాణ గడ్డపై పుట్టిన ఈ ఆణిముత్యాలు దేశ సేవలో తమదైన ముద్ర వేయాలని ఆశిద్దాం.
