SRR Foundation Financial Assistance
ఆకేరు న్యూస్, రాయపర్తి:
మనుషుల మధ్య బంధాలు, బాధ్యతలు తగ్గిపోతున్న ప్రస్తుత సమాజంలో, ‘నేనున్నాను’ అంటూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలకు, ప్రమాదవశాత్తు కాళ్లు, చేతులు విరిగి ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్న నిరుపేదలకు నిరంతరం ఆర్థిక సహాయం అందిస్తూఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తమ ఉదారతను, మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
* దాతృత్వంలో ముందుంజ..
రాయపర్తి మండల పరిధిలోని ఏ గ్రామంలో ఏ నిరుపేద కుటుంబానికి కష్టం వచ్చినా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంటనే స్పందిస్తోంది. ఇటీవల పలు గ్రామాల్లో అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలకు, ఆకస్మికంగా ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నిరుపేద కుటుంబాలను పరామర్శించి, వారి తక్షణ అవసరాల కోసం దహన సంస్కారాలకు, ఇతర ఖర్చులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు.
* బాధితులకు భరోసా
ప్రమాదవశాత్తు కాళ్లు, చేతులు విరిగి, తీవ్ర గాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు నేరుగా వెెళ్లి ఆర్థిక సహాయం అందిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.
మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన గాదరి పూలమ్మ ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయింది నిరాశరాయులైన పూలమ్మకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి 10000/- రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 50 కేజీల బియ్యం ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులతో అందజేశారు.
* గ్రామస్తుల ప్రశంసలు
సమాజంలో సంపాదించిన దానిలో కొంత భాగమైనా తోటివారి కష్టాలను తీర్చడానికి ఉపయోగపడాలనే సంకల్పంతో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు అభినందనీయమని మండల ప్రజలు కొనియాడుతున్నారు. ఏ ఫలమపేక్ష లేకుండా, కష్టాల్లో ఉన్నామని చెప్పగానే స్పందించి ఆర్థిక భరోసా ఇస్తున్న ఫౌండేషన్ సేవలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
”బాధితులకు సాయం చేయడం కంటే మించిన ఆధ్యాత్మికత లేదు. రూపాయి సాయమైనా కష్టాల్లో ఉన్నవారికి అందిస్తే అది వారి జీవితానికి పెద్ద వెసులుబాటు అవుతుంది. మండలంలో ఏ పేదవాడికి కష్టం వచ్చినా మా ఫౌండేషన్ తరఫున ఎల్లవేళలా అండగా ఉంటాం.”
— ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు
కష్టాల్లో ఉన్న నిరుపేదలకు నిరంతరం ఆసరాగా నిలుస్తున్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సేవలను రాయపర్తి మండల ప్రజలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
