*దేశంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్1955 అమలు*
– మార్చి 9న గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ విడుదల చేసిన పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా ఎల్ఎన్జీ, నేచురల్ గ్యాస్ దిగుమతులు భారీగా ఆగిపోయిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ను మార్చి 9న అమలు చేసింది.ఈ మేరకు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ప్రకారం, నేచురల్ గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి, డొమెస్టిక్ PNG, CNG, LPGకు 100% సరఫరా, ఫర్టిలైజర్స్కు 70%, ఇతర పారిశ్రామిక రంగాలకు 80% ప్రాధాన్యత ఇచ్చి సరఫరా, పంపిణీని నియంత్రిస్తుంది. సాధారణ ప్రజల కోసం కొన్ని ముఖ్యమైన వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వ్యాపారం, వాణిజ్యాన్ని నియంత్రించడానికి, నిత్యవసరాల అధిక సేకరణ, బ్లాక్ మార్కెట్, ధరల పెరుగుదల వంటి సమస్యలను అరికట్టి, అవసరమైన వస్తువులు దేశవ్యాప్తంగా అందరికీ సమానంగా, అందుబాటు ధరల్లో ఉండేలా చూసే లక్ష్యంతో ఈ చట్టం రూపొందించబడింది. ఈ చట్టం దేశంలో సంక్షోభ సమయాల్లో ప్రజల ఆహార, ఇంధన అవసరాలను కాపాడే ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుంది.దేశంలో గృహాలు, రవాణా, వ్యవసాయ రంగాలకు గ్యాస్ అందుబాటు కొనసాగేలా ప్రభుత్వం ఈ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. అయితే, పారిశ్రామిక రంగాల్లో కొంత తగ్గింపు ఉండచ్చు.
