*పామునూరు జిపి ముందు నిరసన
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
రీసైక్లింగ్ యూనిట్ మా గ్రామంలో ఏర్పాటు చేయవద్దని పాంనూరు గ్రామస్థులు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మీడియాతో మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన రీసైక్లింగ్ యూనిట్‌ను తమ గ్రామంలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ముఖ్యంగా ఇళ్ల పక్కనే యూనిట్ ఏర్పాటు చేయొద్దని మండిప డ్డారు. ఈ యూనిట్ వల్ల తీవ్ర దుర్వాసనతో పాటు శబ్ద కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం పెరిగే అవకాశం ఉందని అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఇక్కడే యూనిట్ ఏర్పాటు చేస్తామని పట్టుబడితే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని గ్రామస్థులు హెచ్చరించారు. తమ గ్రామంలో రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయకూడదని గ్రామస్థులు, రైతులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో అశోక్, రాజు, రాజేశ్వర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, పరుశురాములు, లింగారెడ్డి, నరేందర్, శివకోటి, శ్రీధర్, కరుణాకర్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
