ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ తాసిల్దార్ గా డొంకెన స్వప్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల బదిలీపై వచ్చిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జిల్లాలోని తహసిల్దారులను బదిలీ చేశారు. గతంలో తాసిల్దార్ గా పనిచేసిన జి.వెంకటేశ్వర్లను కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేయగా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వప్నను స్టేషన్ ఘన్ పూర్ కి బదిలీ చేశారు. ఈ మేరకు సోమవారం డొంకెన స్వప్న తాసిల్దారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను రెవెన్యూ శాఖ ద్వారా అమలు చేస్తూ మండల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
