*కళ్యాణలక్ష్మి గ్రామపంచాయతీల ద్వారా పంపిణీ సరైన విధానం కాదు
*కమలాపూర్ బస్టాండ్ ను వెంటనే ప్రారంభించాలి.
*బిజెపి మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల బీజేపీ నాయకులు రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపు మేరకు సోమవారం బైక్ ర్యాలీ చేపట్టి , కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ స్థానిక తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం హామీలు ఇచ్చి, అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న ఆరు హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదని అన్నారు. రాజకీయ కోణంలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని లబ్ధిదారులకు నేరుగా అందజేయకుండా గ్రామపంచాయతీల ద్వారా పంపిణీ చేయడం సరైన విధానం కాదని విమర్శించారు.లబ్ధిదారులకు నేరుగా అందజేస్తే కళ్యాణ లక్ష్మి కానుకతో పాటు, తులం బంగారం విషయాన్ని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన అన్నారు. స్థానికంగా నిర్మాణంలో ఉన్న కమలాపూర్ బస్టాండ్‌ను రాజకీయ కారణాలతో ప్రారంభించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తక్షణమే దానిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు, కిసాన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి కోటేశ్వర, జిల్లా నాయకులు మండల ప్రభారి ఆకుల రాజేందర్, సీనియర్ నాయకులు బోగి బిక్షపతి, వలిగే సాంబరావు, జెట్టి సారంగపాణి, గోళ్ల తిరుపతి, కిామా పబ్బు సుభాష్, కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీశ్, మౌతం రమేష్ బాబు, అశోక్, ఎండీ రాజ్ మహమ్మద్, పుస్కూరి రాంబాబు, పెండ్యాల ప్రభాకర్ రెడ్డి, తిరువతి రెడ్డి, సుందరయ్య రాజు, సతీష్, రాజేందర్, సురేందర్, శనిగరపు సంపత్, ఎలుగం రాజు, నాసానీ రాజు, గుర్రం సురేష్, బోలిన శివ, జైపాల్, రతన్, శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు…
