*అష్టదళ పాద పద్మారాధన పూజ
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రం శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం పురస్కరించుకొని శ్రీ స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన పూజ బంగారు పద్మాలతో అంగరంగ వైభవంగా జరిపించారు. దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు- కిరణ్మయి దంపతులు 516/- రూపాయలు చెల్లించి పూజ జరిపించుకున్నారు. వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించినారు. కార్యనిర్వాహణాధికారి లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ మోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు రవీందర్ శర్మ , సౌమిత్రి రంగాచార్యులు, కృష్ణమాచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
