*ఐటీ రంగంపై అజ్ఞానం
ఆకేరు న్యూస్, హైద్రాబాద్:
సర్కార్ నడుపుతున్నారా? సర్కస్సా?- కేటీఆర్
హైదరాబాద్ ఐటీ ప్రతిష్ఠకు చిహ్నమైన T-Hub విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కేటీఆర్ తూర్పారబట్టారు. ఐటీ కార్యాలయాల కోసం కేటాయించిన భవనంలో ప్రభుత్వ ఆఫీసులు పెట్టాలని జీవో ఇచ్చి, తిరిగి గంటల్లోనే వెనక్కి తీసుకోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. “T-Hub అంటే చాయ్ కొట్టు అనుకుంటున్నారా? కనీస అవగాహన లేకుండా జీవోలు జారీ చేస్తూ ప్రభుత్వం ఒక సర్కస్ లా తయారైంది” అని ఎద్దేవా చేశారు.
*నగరంలో దోమల రాజ్యం.. పేర్లు మార్చుకోవాల్సిందే!
హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం పడకేసిందని, శాంతిభద్రతలు క్షీణించాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ప్రస్తుతం దొంగలు, దోమల రాజ్యమే నడుస్తోందని విమర్శించారు. “నగరంలో ఫాగింగ్ చేసే దిక్కు లేదు. ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నగరంలోని ప్రముఖ ప్రాంతాలకు దోమలగూడ, దోమలహిల్స్, దోమలబాద్, దోమలపూల్ అని పేర్లు మార్చుకోవాల్సి వస్తుంది” అని కేటీఆర్ అన్నారు.
అధికారంలోకి వచ్చాక 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని , కాంగ్రెస్ దొంగలు పదే పదే అబద్ధాలు చెప్పిండ్రు. వాస్తవానికి కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత .ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 11,921 మాత్రమే. నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తూ… మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలే అని కాంగ్రెస్ నాయకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు. ప్రజల ఆస్తుల విలువ పెరిగినా, కాంగ్రెస్ హామీల విలువ మాత్రం ‘సున్నా’కి పడిపోయిందని ఆయన ముగించారు.
