*మామిడి, వేప పువ్వు కరువుతో..
*ఉగాది పచ్చడి పరేషాన్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ఆలస్యంగా కాతకు వచ్చిన మామిడి, అంతు చిక్కని వ్యాధితో వేప చెట్లు దర్శనమిస్తుండడంతో రేపటి ఉగాది పచ్చడి తయారీ ప్రజలకు పరేషాన్ గా మారనుంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ పరిధిలో ఎక్కడ చూసినా మామిడి తోటలు 90 శాతం పింద దశలోనే దర్శనమిస్తున్నాయి. వేప చెట్లను చూస్తే అంతుచిక్కని వ్యాధితో ఆకులు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి.
*షడ్రుసుల ఉగాది పచ్చడి
తెలుగు సంవత్సరాది ఉగాది పచ్చడను బెల్లం(ఆనందానికి సంకేతం), ఉప్పు(ఉత్సాహానికి ప్రతీక), కారం (సహనం కోల్పోయి), చింతపండు(నేర్పుగా వ్యవహరించేందుకు), వేప పువ్వు(చేదు జ్ఞాపకాలు), పచ్చి మామిడి(కొత్త ఉత్సాహం కోసం) (షడ్రుసుల) సమ్మేళనంతో తయారు చేస్తారు.
” వేప పువ్వు కరువు
కరోనా తర్వాత నుండి దాదాపు వేప చెట్లన్నీ ఎండిపోతు చిగురుస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఎటు చూసినా వేప చెట్లన్నీ ఎండిపోయే దర్శనమిస్తున్నాయి. ఉగాది పచ్చడిలో ప్రధాన పాత్ర పోషించే వేప పువ్వు కోసం ప్రజలు ఇబ్బందులు పడకు తప్పదు. ఇది అదనుగా భావించిన కొందరు రైతులు, చిరు వ్యాపారులు అదరుగా దొరికిన వేప పువ్వు, కొమ్మలను మార్కెట్లో అమ్ముతున్నారు.
* మామిడికాయలు కొరత
ఉగాది నాటికి విరగాయాల్సిన మామిడి ఇప్పుడిప్పుడే పిందెలు వేస్తుంది.100కు 10 శాతం చెట్లు కాయలు కాస్తే 90 శాతం చెట్లు కింద దశలోనే ఉన్నాయి. దీంతో ఈ పచ్చల కోసం కొనుగోలు చేయాల్సిన మామిడికాయలకు భలే గిరాకీ ఉంది. ఒక్కో మామిడికాయను 10, 15 రూపాయలు మార్కెట్లో అమ్ముతున్నారు. మరి కొంతమంది సీజనల్ వ్యాపారస్తులు వేప పువ్వు, మామిడికాయలు, మామిడి ఆకులు కలిపి 50 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. ఏది ఏమైనా అడవిలో దొరికే వేప పువ్వు, మామిడికాయల కొరతతో ఉగాది పచ్చడి తయారీ పరేషాన్ గా మారనుంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
