*ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆరంభాలకు నాంది పలికే శుభసందర్భం. ఈ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంట సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నిండాలని ఆకాంకక్షించారు..
జిల్లా ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండి అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
