* హోటల్ నిర్వాహకులను ఆదుకోవాలి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
హోటల్ నిర్వాహకులను ఆదుకోవాలని కోరుతూ మండల కేంద్రంలోని హోటల్, దాబాల నిర్వాహకులు శుక్రవారం ఆర్డీవో డిఎస్ వెంకన్న ను కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వంటగ్యాస్ సిలిండర్లను వ్యాపార నిర్వహణ నీమిత్తం ప్రభుత్వం చొరవ తీసుకుని హొటల్ నిర్వాహకులకు సరఫరా చేసి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెడ్డి మెస్, ఆర్ఆర్ డాబా, వేణు దాబా, సూర్య మెస్, వినాయక దాబా, ఆర్కే దాబా, రమ్యశ్రీ భవాని, హరిత దాబా తోపాటు వివిధ ఓటర్ల నిర్వాహకులు ఆర్డీవో డిఎస్ వెంకన్నను కలిసి హోటల్, దాబా నిర్వాహకులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
