ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిలుపూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు పుట్టినరోజు సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య ఆధ్వ ర్యంలో ఆదివారం ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పొన్నం స్వరూప రాజయ్య మాట్లాడుతూ శ్రీధర్ రావు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాం క్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ గోనెల ఉపేందర్, పొన్నం నాగరాజు, రంజిత్ కుమార్, నీల పరుశరా ములు, మామిండ్ల శ్రీను, పండుగ అశోక్, మునిగేల రాజు, రమేష్, మధు, పవ న్, శ్రవణ్, వేముల రాము, పిట్టల చంద్రయ్య, ఊరడి శ్రీను, అఖిల్, కుంభం మధు, నితిన్, శాగ శివ, చెవినబోయిన అనిల్, మహేష్ , పిట్టల హరీష్, పొన్నం రమేష్, శాగ శంకర్, జంపాల శీను తదితరులు పాల్గొ న్నారు.
“తాగునీటి ఇబ్బంది తొలగించిన కౌన్సిలర్
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి (చాగల్లు) 9వ వార్డు ఎస్సీ కాలనీలో ఉన్న 3వ అంగన్వాడీ కేంద్రంలో కొంతకాలంగా తాగు నీటి సమస్య నెలకొంది. అంగన్వాడీ కార్యకలాపాల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న వార్డు కౌన్సిల ర్ సౌధరపల్లి సంపత్ రాజ్ వెంటనే స్పందించి అంగన్వాడీ కేంద్రానికి నల్ల కనెక్షన్ తోపాటు నీటి నిల్వ కోసం సిమెంట్ రింగులు వేయించారు. 9వ వార్డులో ఎక్కడైనా సమస్యలు ఉన్న తన దృష్టికి తెస్తే ఉంటే వెంటనే పరిష్కరిస్తానని కౌన్సిలర్ సంపత్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ భాస్కుల యాద గిరి, వార్డ్ కాంగ్రెస్ నాయకులు భాస్కుల నాగరాజు, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు ఐలపాక శ్రీనివాస్, భాస్కుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
