* స్ఫూర్తి దాతలు విప్లవ వీర కిశోరాలు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
నవతరానికి స్ఫూర్తి దాతలు విప్లవ వీర కిశోరాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ఎండీ యునుస్ ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ ఎండీ రహ్మతుల్లాహ్ అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల95వ వర్ధంతి సందర్భంగా యునుస్, రహ్మతుల్లాహ్ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి స్వాతంత్ర్య జ్వాలలను తన మనసు నిండా నింపుకొని స్వాతంత్రం ఉద్యమం వైపు ఆకర్షితులై భారత దేశ స్వతంత్ర సంగ్రామం వైపు అడుగులు వేశారు అన్నారు. స్వాతంత్ర పోరాటం ఉవెత్తిన ఎగసి పడుతున్న తరుణంలో 1929న పార్లమెంట్ పై బాటకేశ్వరదత్ తో పొగ బాంబులు వేసి కరపత్రాలు జల్లి విప్లవం వర్ధిల్లాలని నినాదాలు చేసిన
భగత్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి ఆయన చరిత్రను పాఠ్యాంశాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
మార్క్సిజం వైపు భగత్ సింగ్ ఆలోచనలు భగత్ సింగ్ అతని సహచరులు భారత కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై భారత కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించారు భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ ల ఊరిని ఆపి ఉంటే దేశంలో ఉన్న యువత విద్యార్థుల్లో భగత్ సింగ్ స్వాతంత్ర జ్వాలలను మరింత రగిలించేవాడని అన్నారు. భగత్ సింగ్ బలిదానం ద్వారా అమరవీరుడిగా భగత్ సింగ్ గుర్తింపు పొందాడు భగత్ సింగ్ మరణం తర్వాత దేశంలో విప్ల ఉద్యమాలు మరింత బలపడ్డాయని భగత్ సింగ్ స్ఫూర్తితో దేశంలో విప్లవ భావజాలం కలిగిన అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏర్పాటుకు దోహదపడ్డాయని ఆయన అన్నారు. సార్వభౌమ అధికారం లౌకికవాదం సోషలిజం సెక్యులరిజం కమ్యూనిజం కోసం పోరాడుతున్న ఎందరికో గొప్ప స్ఫూర్తి ప్రదాత భగత్‌సింగ్ అని ఆయన కొనియాడారు నేటి తరానికి స్ఫూర్తిదాత చరిత్ర వీరుల్ని విప్లవదీరులని పట్టిస్తుంది అలాంటి పోరాట యోధుడిని భగత్ సింగ్ భారతమాత సంఖ్యలను తెంచేందుకు ఉరితాడుని పూలమాలలుగా వేసుకొని ధైర్యశాలి ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనం భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ లను ఆదర్శంగా తీసుకొని నేటి యువత విద్యార్థులు విద్యా కాషాయకరణ కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొలిపాక రంజిత్, ఇమ్రాన్, ఫైసల్ చరణ్, తరుణ్, అంజి, తదితరులు పాల్గొన్నారు.
