* జాతీయ కమిటీ కో-ఆప్టెడ్ సభ్యుడిగా రాజు కొయ్యల
ఆకేరు న్యూస్, హనుమకొండ : చార్టెడ్ అకౌంటెంట్ వృత్తి నిబద్ధత, నైతిక విలువల అభివృద్ధికి తోడ్పడటమే తన లక్ష్యమని వరంగల్‌కు చెందిన ప్రముఖ చార్టెడ్ అక్కౌంటెంట్ రాజు కొయ్యల పేర్కొన్నారు. చార్టెడ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కమిటీలో కో-ఆప్టెడ్ సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఈ నియామకం తన గౌరవాన్ని పెంచిందని, ఇది కేవలం ఒక పదవి మాత్రమే కాకుండా, చార్టర్డ్ అకౌంటెంట్స్ వృత్తికి అర్థవంతమైన సేవ చేయడానికి గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఐసీఏఐ మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్ కమిటీ ద్వారా ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌కు సంబంధించి విధానాలు, మార్గదర్శకాలు రూపొందుతాయని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ఐసీఏఐ అధ్యక్షులు సీఏ ప్రసన్న కుమార్ రెడ్డితోపాటు తన పేరును సూచించిన సీఏ ముప్పాల శ్రీధర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కమిటీలో సభ్యుడిగా నియామకమైన రాజు కొయ్యలను పలువురు అభినందించారు.
