* నిలిచిన భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
ఆకేరు న్యూస్, హనుమకొండ : రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ప్రధాన సర్వర్లలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి సర్వర్లు పనిచేయకపోవడంతో స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ కేవైసీ ప్రక్రియలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న క్రయవిక్రయదారులు, వారి వెంట వచ్చిన సాక్షలు ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో కొందరు అహనం కోల్పోయి అధికారులతో వాగ్వాదానికి తిరుగుతున్నారు. అయితే ప్రధాన సర్వర్లలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు నిపుణులను రంగంలోకి దింపినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందో క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
