* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
ఆకేరు న్యూస్, భూపాలపల్లి : బిల్లులు చెల్లించాలని అడిగినందుకు ఏపీఏఓ ఫణి భూషణ కశ్యప్ కాంట్రాక్టర్‌ను నానా బూతులు తిట్టడమే కాకుండా టేబుల్‌పై ఉన్న వస్తువులతో దాడి చేశాడు. ఈ ఘటనలో కాంట్రాక్టర్ వీరేందర్ మొహంపై గాయాలయ్యాయి. దీంతో బాధితుడు స్థానికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సదరు అధికారిపై కేసు నమోదైంది. బిల్లులు క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్లను వేధిస్తుండడంతో ఏపీఏఓపై గతంలో కాంట్రాక్టర్ వీరేందర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిని మనసులో పెట్టుకున్న ఏపీఏఓ ప్రస్తుత బిల్లులను ఇవ్వకుండా వేధిస్తూ దాడి చేసినట్లు కాంట్రాక్టర్ వాపోయాడు.
