* జిల్లా సహాయకార్యదర్శి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ఏప్రిల్ 1 నుండి10 వరకు నిర్వహించే ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి ఆదిశాయన్న పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి చాగల్లులో నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆదిశాయన్న మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడే ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. ఈ దేశంలో కార్మిక కర్షక వర్గాల పక్షాన నిలబడి సుదీర్ఘ పోరాటాలు నిర్వహిస్తు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు. నేడు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇంటింటికి సిపిఐ అంటూ 10 రోజుల కార్యక్రమాన్ని తీసుకోని ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి సముద్రాల రాజు, సహాయకార్యదర్శి జీడీ ఆశీర్వాదం, బూర్ల మల్లిఖార్జున్, బూర్ల యాదగిరి,పొన్న సాయిలు, పొన్న మల్లయ్య, పెండేల రాజయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
