* ప్రూఫ్ చేస్తే కేటీఆర్, హరీశ్‌రావు రాజీనామా చేస్తారా..
* అసెంబ్లీలో సవాల్ విసిరిన ఎమ్మెల్యే నాయిని
ఆకేరు న్యూస్, హనుమకొండ : బీఆర్ఎస్ వాళ్లు హనుమకొండ సిటీ సెంటర్లో రూ.200 కోట్ల ఆస్తి పార్టీ కార్యాలయం కోసం కబ్జా చేసిండ్లు.. నిరూపించకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపిస్తే కేటీఆర్, హరీశ్‌రావు రాజీనామా చేస్తారా.. అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్ చేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు మూడు సార్లు గెలిచినమని చెప్పుకునేటోళ్లు మూడు లక్షల కు, 5 లక్షలు దోచుకున్న పంచాయతీలకు హౌస్ కమిటీలో అడిగండ్రు..
బీఆర్ ఎస్ వాళ్లు రూ.200 కోట్ల విలువచేసే ప్రాపర్టీ సిటి సెంటర్లో పార్టీ కార్యాలయానికి కబ్జాలు పెట్టిన విషయాన్ని నేను ఇన్ఫర్మేషన్ ఆక్ట్ ప్రకారం ఆధారాలతో చూపిస్తూ మీడియాలో, అసెంబ్లీలో మొత్తుకుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కోట్లు కోట్లు దండుకున్నొళ్లే దొంగ.. దొంగని అంటుంటే కార్యకర్తలే బాధపడుతున్నారు. ఎందుకు వాళ్ళని జైళ్ళలో పెట్టలేరదని ప్రశ్నించారు. ఇన్ని పాపాలను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు నెత్తి నోరు మొత్తుకుంటున్నా పాపం పోనీ అని కక్ష సాధింపు చర్య వద్దని ముఖ్యమంత్రి వదిలేయడం వల్లే ఈ దొంగల ముఠాలు దేశం మీద దాడి చేస్తున్నాయని ధ్వజమెత్తారు. నేను గనుక కబ్జాను ప్రూఫ్ చేయకపోతే 24 గంటల్లో నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.. ప్రూఫ్ చేస్తే కేటీఆర్. హరీష్ రావు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. కబ్జాభూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. అక్రమాలపై సిబిసిడితో విచారణ చేయించాలి.. హౌస్ కమిటీలో పెట్టాలి అని డిమాండ్ చేశారు.
