ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
మీ ఆరోగ్యమే ప్రయాణికులకు భద్రత అని స్థానిక సీఐ జి.వేణు అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, తుఫాన్ డ్రైవర్లకు కంటి పరీక్షలు చేపించారు. (Arrive Alive) కార్యక్రమంలో బాగంగా డ్రైవర్లకు డాక్టర్ హేమంత్ హనుమకొండచే కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటే ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేరుస్తారన్నారు. ఈ కార్యక్రమంలోఎస్సై బి.వినయ్ కుమార్, ఎస్సై రాజేష్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
