* వరంగల్ ప్రెస్ మీట్లో బ్రెయిన్ సర్జరీ వివరాల వెల్లడి
* పగిలిన రక్తనాళం.. చావు అంచుల్లో వ్యక్తి!
*49 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను కాపాడిన టైటానియం క్లిప్ సర్జరీ
ఆకేరు న్యూస్, వరంగల్: సాధారణంగా వచ్చే తలనొప్పిని మనం తేలికగా తీసుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అదే తలనొప్పి ప్రాణాపాయానికి సంకేతం కావచ్చు అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. మెదడులోని రక్తనాళాలు బలహీనపడి ఉబ్బి, పగిలిపోయే స్థితిని ‘బ్రెయిన్ అన్యురిజం’ అంటారు. తాజాగా మలక్‌పేటలోని యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ఇటువంటి అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఒక 49 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా సర్జరీ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. ఈ అరుదైన మెడికల్ మిరాకిల్ వివరాలను మంగళవారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య బృందం వెల్లడించింది.
* అసలేం జరిగిందంటే?
గత ఏడాది డిసెంబర్ 5, 2025న 49 ఏళ్ల ఒక వ్యక్తి తీవ్రమైన తలనొప్పితో అత్యవసర స్థితిలో యశోద హాస్పిటల్‌కు వచ్చారు. వైద్యులు వెంటనే అతనికి సీటీ స్కాన్ నిర్వహించగా, మెదడులో రక్తస్రావం (Acute Hemorrhage) జరిగినట్లు గుర్తించారు. తదుపరి పరీక్షల్లో మెదడులోని ప్రధాన రక్తనాళంపై పెద్ద ‘బ్రెయిన్ అన్యురిజం’ ఉన్నట్లు తేలింది. ఈ అన్యురిజం మెదడుకు రక్తం సరఫరా చేసే కీలకమైన చిన్న రక్తనాళాల వద్ద ఉండటంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది.
నిర్వహించిన క్లిష్టమైన చికిత్స (మైక్రో సర్జికల్ క్లిప్పింగ్)
అన్యురిజం ఉన్న చోట రక్తనాళాల నిర్మాణం క్లిష్టంగా ఉండటంతో కోయిలింగ్ లేదా స్టెంట్ వంటి సాధారణ చికిత్సలు సురక్షితం కాదని వైద్యులు నిర్ణయించారు. దీనివల్ల మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయే ప్రమాదం ఉందని భావించి, అత్యవసరంగా ‘ఓపెన్ బ్రెయిన్ మైక్రో సర్జికల్ క్లిప్పింగ్’ నిర్వహించారు.
అత్యవసర క్రానియోటమీ. తక్షణమే శస్త్రచికిత్స ప్రారంభించారు. అన్యురిజం బలహీనమైన భాగాన్ని మూసివేయడానికి చిన్న టైటానియం క్లిప్‌ను అమర్చారు.
కీలక రక్తనాళాలను కాపాడుతూ, మెదడుకు సాధారణ రక్తప్రవాహం కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.
వైద్యుల అభిప్రాయం
ఈ ఆపరేషన్ గురించి కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డా. జయానంద్ సుధీర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. “ఇది అత్యంత క్లిష్టమైన మరియు ప్రాణాపాయకరమైన బ్రెయిన్ అన్యురిజం కేసు. కీలక రక్తనాళాలు అన్యురిజం నుంచే బయటకు రావడంతో ఎండోవాస్కులర్ చికిత్సలు సురక్షితం కాలేదు. సకాలంలో చేసిన ఓపెన్ బ్రెయిన్ శస్త్రచికిత్స ద్వారా రోగి ప్రాణాలను కాపాడగలిగాం” అని తెలిపారు.
* వేగంగా కోలుకున్న రోగి:
శస్త్రచికిత్స అనంతరం రోగి ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకున్నారు. ఎటువంటి నరాల బలహీనత (Neurological deficits) లేకుండా స్థిరంగా ఉన్న రోగి, కేవలం 5 రోజుల్లోనే (డిసెంబర్ 13, 2025) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి, స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లారు.
* యాజమాన్యం స్పందన:
యశోద హాస్పిటల్ మలక్‌పేట యూనిట్ హెడ్ కె. శ్రీనివాసరెడ్డి, అసిసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర మరియు డైరెక్టర్ డా. పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. అత్యాధునిక న్యూరో సర్జరీ సౌకర్యాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందం మరియు 24/7 అందుబాటులో ఉండే న్యూరో క్రిటికల్ కేర్ సేవల వల్లే ఇలాంటి క్లిష్టమైన కేసులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నామని పేర్కొన్నారు.
మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన నంబర్లు:
ఎ. వాసుకిరణ్ రెడ్డి – 97057 71230 / 99499 98378
Dr VIGNESH – RHEUMATOLOGIST | ఆడవాళ్లలో కీళ్ల వాతం ఎక్కువ
Please tell us what is wrong. Your report will be sent to the website team.

