ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
తన దృష్టికి వచ్చిన వార్డు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏడవ వార్డు కౌన్సిలర్ అన్నెపు సుమలత కుమార్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు పద్మశాలి కాలనిలో వేసవి తాపాన్ని తీర్చేందుకు బుధవారం బోర్ లో మోటార్ దింపి పంపింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుమలత కుమార్ మాట్లాడుతూ తన వార్డులో ఏ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తన వార్డులు బోరు మోటార్ బిగించేందుకు సహకరించిన వినయ్ కుమార్ కి 7వార్డు ప్రజలందరి తరుపున ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలి కాలనీ వాసులు సుధాకర్, అశోక్, శ్రీకాంత్, రాజేష్, వినయ్, మహాలక్ష్మి, అనిత, సత్తెమ్మ, లక్ష్మి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
