ఆకేరు న్యూస్ , వరంగల్ :
69వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్ లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పి. ఆర్. ఓ మన్నవ మోహన కృష్ణ రాణించాడు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ నగరంలో జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ మార్చి 29 నుంచి ప్రారంభమైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పి. ఆర్. ఓ గా విధులు నిర్వహిస్తున్న హెడ్ కాభిస్టేబుల్ మోహన కృష్ణ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ టీం విభాగంలో ప్రతిభ కనబరిచారు.
శుక్రవారం రాత్రి నాగ్‌పూర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ, కోచ్ జయరాజ్, కానిస్టేబుల్ రాజశేఖర్‌లతో కలిసి కేంద్ర మంత్రి చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీని అందుకున్నారు.ఈ సందర్బంగా పోటీల్లో రాణించిన మోహన కృష్ణ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది అభినందించారు.
———————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
