Narendra Reddy death Kadiyam Kavya
*ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి మృతి నియోజకవర్గానికి తీరని లోటు అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నరేందర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఎంపీ కావ్య గుర్తు చేసుకున్నారు. తండ్రి సామానులైన నరేందర్ రెడ్డిని కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఎల్లప్పుడూ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే నాయకుడు, నియోజకవర్గానికి పెద్ద అన్నలా ఉండే నరేందర్ రెడ్డి ఈ రోజు మన మధ్య లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నజీర్, స్థానిక మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కౌన్సిలర్లు సంపత్ రాజు, బొల్లు లక్ష్మి, నాయకులు స్వామి నాయక్, సింగపురం దయాకర్, అంబటి కిషన్ రాజు, సున్నం యాదగిరి, జగన్ రెడ్డి, వేతి జైపాల్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
