ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్:
విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజా బాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏఈ పి శంకర్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఛాగల్ శివారు కమ్మరిపేటలో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో ఏఈ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో వారానికి మూడు రోజులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. వివిధ ప్రాంతాల్లో వదులుగా ఉన్న విద్యుత్ తీగలను గుర్తించి మధ్యస్థ స్థంబాలను నాటించి లైన్లను సరిచేస్తున్నామని తెలిపారు. వంగిపోయిన, పురాతన స్థంబాలు మార్చుట, విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తెలియజేయాలని విద్యుత్తు వినియోగదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ ఇన్సిపెక్టర్ ఎల్ రామాచారి, లైన్ మెన్ అనుమాండ్ల యుగేందర్, రైతులు ముప్పిడి నర్సయ్య, కుమార్, రాములు, శ్రీనివాస్, యాదగిరి, ఎల్లయ్య, కొమురెల్లి, రేకులపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు
