TPCC chief Mahesh Kumar Goud
* ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
* కార్యకర్తలే మా ధైర్యం
ఆకేరు న్యూస్ ములుగు:
తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమమే రెండు కళ్ళ లాగా పని చేస్తుండటమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ములుగు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఆశీర్వాదం రాహుల్ గాంధీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి సారధ్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రతి హామీని నెరవేర్చుటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి ఆర్థికంగా సామాజికంగా సంక్షేమం తదితర అన్ని రంగాలలోని చేయుతనందిస్తామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉందని దానితో ఈ ప్రాంతాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం 52% బిసిలకు రిజర్వేషన్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. దీంతో మున్సిపాలిటీ ఎన్నికలలో కనివిని ఎరగని రీతిలో విజయం సాధించామని అన్నారు. ప్రస్తుతం మహిళకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు ,సన్న బియ్యం తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని వివరించారు. కార్యకర్తలు మా ధైర్యం ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కష్టాన్ని నమ్ముకుని పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలని కార్యకర్తలను కోరారు. ములుగు జిల్లా ప్రాంత అభివృద్ధికి అనేక రంగాలలో సీతక్క చొరవతో అనేక కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ప్రతి కార్యకర్త అండగా ఉంటూ సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకునేలా కృషిచేయాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడే నాయకుడు అవుతారని కార్యకర్తలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు అశోక్ లతోపాటు ములుగు జిల్లాలోని మండల కమిటీల అధ్యక్షులు మార్కెట్ చైర్మన్ లు డైరెక్టర్లు కౌన్సిలర్లు సర్పంచులు వార్డు సభ్యులు కార్యకర్తలు తాజా మాజీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
