Hindu Sammelanam Station Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 23న హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించాలని కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి సోమశేఖర్ గుప్తా తెలియజేశారు. ఆదివారం డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ నిర్వహించని విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పాత జయలక్ష్మి సినిమా టాకీస్ ప్రాంగణంలో నిర్వహించే హిందూ సమ్మేళనం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి స్వామీజీ శ్రీ శ్రీ దరానంద భారతి స్వామి ముఖ్య వక్త గా విచ్చేస్తున్నట్లు తెలియజేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి గడ్డం కృష్ణమూర్తి, కోశాధికారి యాద శ్రీనివాస్, అంబటి హేమంత్ రాజు, ఆమంచ మధు, సరాబు ఆంజనేయులు, గౌరీశెట్టి అనిల్, వేళ్ల సురేందర్, యంజాల ప్రభాకర్, రాజ బ్రహ్మచారి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
