4-year girl rape Murder Uttarpradesh
* నాలుగేళ్ల పాపపై అత్యాచారం
* గొంతు కోసి హత్య
ఆకేరు న్యూస్, డెస్క్: సమాజం తలదించుకునేలా వరుస అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్న వేళ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక ఘోర కలికి తగిన శాస్తి చేశారు. నాలుగేళ్ల పసిపాపపై పైశాచికంగా అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి చంపిన ఓ నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
*అత్యంత కిరాతకంగా చిన్నారిపై అత్యాచారం
ఘాజియాబాద్ జిల్లాకు చెందిన జీషన్ అనే వ్యక్తి మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించాడు. వరుసకు కోడలయ్యే నాలుగేళ్ల చిన్నారిపై కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో ఆ చిన్నారిపై అత్యంత కిరాతకంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. పసిపాప రోదనలు బయటకు వినపడకుండా ఉండేందుకు, తన పాపం బయటపడుతుందనే భయంతో ఆ చిన్నారిని గొంతు నులిమి అత్యంత క్రూరంగా హత్య చేశాడు.
*నిందితుడు ఎన్కౌంటర్
చిన్నారి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, నిందితుడు జీషన్ అక్కడి నుండి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు తలదాచుకున్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టగా, తప్పించుకునే క్రమంలో అతడు పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో కిరాతకుడు జీషన్ అక్కడికక్కడే మరణించాడు. “చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఇదే హెచ్చరిక” అంటూ స్థానికులు పోలీసుల చర్యను హర్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
