Station Ghanpur CC road quality
*అడ్డుకున్న టిఆర్ఎస్ కౌన్సిలర్లు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి చాగల్ కాటమయ్య గుడి వద్ద రూ.4 లక్షలతో చేపట్టిన సీసీ పనులలో నాణ్యత లేదని టిఆర్ఎస్ కౌన్సిలర్లు పొన్న రాజేష్, బాలగాని అనిల్, తాటికొండ మధు, చల్ల రమ్య రఘు రెడ్డి, బూర్ల రాజేశ్వర్లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల సిమెంటు, కంకర, ఇసుక నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చివరికి సీసీ పోసే ప్రాంతంలో ఫాల్దీన్ కవర్ కూడా వేయకపోవడం పట్ల వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేసి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ సీసీ పనులు సాగుతున్న కాటమయ్య గుడి ప్రాంతాన్ని సందర్శించి సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్నివాదం జరిగింది. క్వాలిటీ కంట్రోలర్ విచారణ జరిపించిన అనంతరమే బిల్లు చెల్లిస్తామని లేదా బిల్లు చెల్లించకుండా తిరిగి సిసి వేయిస్తానని చైర్మన్ వినయ్ కుమార్ హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఏప్రిల్ 30 నుండి ఐదు రోజులపాటు జరిగే కాటమయ్య పండుగ సజావుగా జరిగేందుకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
