Veerabrahmendra Swamy Aradhana Station Ghanpur
*స్టేషన్ ఘన్ పూర్ లో …. బ్రహ్మంగారి ఆరాధన దినోత్సవం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం రాత్రి శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి పొందిన రోజు సందర్భంగా బ్రహ్మంగారి గుడిలో ఉత్సవ మూర్తికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో బ్రహ్మేంద్ర స్వామికి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు కేశోజు రమేష్, చంద్రమోహన్, మోహన్ బాబు, శ్రీను, రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
