Burla Shankar festival committee Shivunipalli
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ముదిరాజ్ పెద్దమ్మ తల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి శివుని పల్లి దేవాలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ‘బూర్ల’ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్
మున్సిపాలిటీ పరిధి శివునిపల్లిలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు చిక్కుడు రమేష్, కార్యదర్శి పిట్టల అశోక్ పాలకవర్గం ఆధ్వర్యంలో ముదిరాజ్ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో ముదిరాజ్ పెద్దమ్మ తల్లి, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ‘బూర్ల’ శంకర్, ఉపాధ్యక్షులుగా గోరంట్ల యాదగిరి, మ్యాడబోయిన సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి గా సంకెళ్ళ రవి, డైరెక్టర్ లుగా ముప్పిడి శ్రీను, పుంజురు రాజు, కొండ వేణు, పిట్టల అనిల్, చిక్కుడు పెద్దాపురం, చెన్నూరు ఆంజనేయులు, పిట్టల రాజు, నీల సారయ్య ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ డా.బండా ప్రకాష్ ముదిరాజ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ స్థానిక శాసన సభ్యులు కడియం శ్రీహరి సహాయం, దాతల చేయుతతో, మత్స్య సొసైటీ గుడి కమిటీ పాలక వర్గ సభ్యుల సహకారాలతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి చెన్నూరు వెంకటేశ్వర్లు, మత్స్య సొసైటీ ఉపాధ్యక్షులు చెన్నూరు వేణు, డైరెక్టర్లు గోరంతల చంద్రు, వెయ్యి సోమయ్య, కొండ రాజు, పిట్టల వెంకన్న, భుర్ల శ్రీనివాస్, నీల రాజు కుల సంఘం పెద్దలు నీల లింగం, పిట్టల మల్లయ్య, పిట్టల తిరుపతి,పిట్టల శంకర్, మ్యాడబోయిన యాదగిరి, నీల శివ లింగం, భుర్ల రాజశేఖర్, భుర్ల తిరుపతి, పిట్టల అజయ్, చిక్కుడు అజయ్, పిట్టల సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
