Airtel SIM petrol offer Dummapeta
* సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఉచితం
* పోర్టింగ్ ఆఫర్‌కు జనం క్యూ
ఆకేరు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం : వ్యాపారంలో రాణించాలన్నా, కస్టమర్లను ఆకర్షించాలన్నా ఐడియా ఉండాలి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఎయిర్టెల్ సిబ్బంది సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. పెట్రోల్ కొరతను సాకుగా తీసుకుని వారు ప్రకటించిన ఒక వినూత్న ఆఫర్ ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.
దమ్మపేట మండల కేంద్రంలో ఎయిర్టెల్ నెట్వర్క్ ప్రచారంలో భాగంగా సిబ్బంది ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎవరైనా తమ పాత నెట్వర్క్ నుండి ఎయిర్టెల్ (MNP) లోకి పోర్ట్ అయ్యి, రూ. 350లతో రీచార్జ్ చేసుకుంటే వారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు.*ఈ
*ఆఫర్ కోసం క్యూ కడుతున్న జనం
ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటం, దానికి తోడు స్థానికంగా పెట్రోల్ కొరత ఏర్పడటంతో జనం ఈ ఆఫర్ వైపు మొగ్గు చూపుతున్నారు. నెట్వర్క్ మారడంతో పాటు, రీచార్జ్ చేసుకుంటే చాలు.. వెనువెంటనే లీటర్ పెట్రోల్ లభిస్తుండటంతో కొత్త సిమ్ కార్డులు తీసుకునేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సాధారణంగా సిమ్ కార్డులు అమ్మడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ ఇలా పెట్రోల్ ఆఫర్ ఇవ్వడం భలేగా ఉంది. రీచార్జ్ ఎలాగో చేసుకుంటాం, దాంతో పాటు లీటర్ పెట్రోల్ రావడం సంతోషంగా ఉంది” అని అక్కడి ప్రజలు అంటున్నారు.
*వ్యాపార వ్యూహానికి నెటిజన్ల ఫిదా
సమయానుకూలంగా స్పందించి, ప్రజల అవసరాన్ని (పెట్రోల్) తమ వ్యాపార వృద్ధికి వాడుకున్న ఎయిర్టెల్ సిబ్బంది తెలివితేటలను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మొత్తానికి, దమ్మపేటలో ఎయిర్టెల్ సిబ్బంది వేసిన ఈ మాస్టర్ ప్లాన్ మార్కెటింగ్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది.
