Hanamkonda chain snatcher CCTV
* గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి
* సీసీటీవి ఫుటేజీ విడుదల చేసిన పోలీసులు
ఆకేరు న్యూస్, హనుమకొండ : ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడు తున్న దొంగను గుర్తించాలని హనుమకొండ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం హనుమకొండ బొక్కల గడ్డ సమీపంలోని సిటీజన్ పంక్షన్ హాల్ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును లాక్కెళ్ళారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవి ఫుటేజీ ఆదారంగా చైన్ స్నాచింగ్ కు పాల్పడిని నిందితుడి ఫోటోలను విడుదల చేశారు. గ్రీన్ కలర్ టీ షర్ట్, నల్ల ప్యాంట్, క్యాప్ ధరించిన నిందితుడిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హన్మకొండ ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్ ప్రజలను కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
