TVK candidate Srinivas wins by 1 vote
* ఒక్క ఓటు.. ఒక చరిత్ర
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ప్రతి ఓటు విలువైనదనీ,ఒక్క ఓటు కారణంగా ఎంతో మంది అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు మారిపోతుందని తమిళనాడు ఎన్నికల ఫలితం నిరూపిస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో వరించిన విజయం సంచలనం అయింది. తిరుప్పట్టూర్ నియోజకవర్గంలో TVK పార్టీ అభ్యర్థి ఆర్. సీనివాస సేతుపతికి 83,375 ఓట్లు రాగా, DMK పార్టీ అభ్యర్థి కె.ఆర్ పెరియకరుప్పన్ ఒక్క ఓటు తక్కువగా 83,374 ఓట్లు వచ్చాయి. తేడా కేవలం +1 ఓటు. నియోజకవర్గంలో 30/30 EVM రౌండ్లు పూర్తయ్యాక వచ్చిన ఫలితాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. ఒక్క ఓటు తేడాతో గెలుపు, ఓటములు నిర్ణయమవడం భారత ఎన్నికల చరిత్రలోనే అరుదైన సంఘటనల్లో ఒకటి. కాగా ఎన్నికల సంఘం ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది.
ఓడిపోయిన అభ్యర్థి తిరుప్పట్టూర్ నియోజకవర్గంలో 2006 నుండి 2021 వరకు నాలుగు సార్లు వరుసగా గెలుస్తూ వస్తున్న పెరియకరుప్పన్ ను సీనివాస సేతుపతి ఓడించాడు.
*ఓటు వేయని వారికి గుణపాఠం
ప్రతి ఒక్క ఓటు ప్రభుత్వాల తలరాతను, నాయకుల భవిష్యత్తును మార్చగలదని ఈ ఫలితం నిరూపించింది. నియోజకవర్గ అభివృద్ధిని నిర్ణయించేది సామాన్యుడు వేసే ఆ ఒక్క ఓటే అని, అది ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఓటు వేయడానికి బద్ధకించే ప్రతి ఒక్కరికీ ఇది ఒక గొప్ప పాఠం. ఒక్క ఓటు తక్కువైనా ఓటమి తప్పదని, ఒక్క ఓటు ఎక్కువైనా చరిత్ర సృష్టించవచ్చని శ్రీనివాస సేతుపతి విజయం ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటిచెప్పింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
