Station Ghanpur Rythu Sangrama Sabha
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు జరగబోయే రైతు సంగ్రామ సదస్సును విజవంతం చేయాలని ఆ పార్టీ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కేసిరెడ్డి మనోజ్ రెడ్డి, మండల ఇంచార్జి మాలోతు రమేష్ నాయక్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో గ్రామ గ్రామాన రైతు సంగ్రామ సదస్సు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభను విజయవంతం చేసేందుకు మండలం నుండి రైతులు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయని, రైతు హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరం చేసేందుకు రైతాంగం తరలిరావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతు పండించిన చివరి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, మండల నాయకులు మారాపాక రమేష్, శ్రీపతి పల్లి గ్రామ అధ్యక్షులు పల్లం శ్రీను, బూత్ ఇంచార్జిలు, తిరుపతి, బిక్షపతి, అంజ్జి, తదితరులు పాల్గొన్నారు.
