Kanna Raju Venkatapur Electricity Consumers Camp
ఆకేరు న్యూస్, ములుగు:
వెంకటాపూర్ లోని 33/11 KV సబ్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో బుధవారం విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు ఏర్పాటు చేసినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ డివిజినల్ ఇంజనీర్ కన్న రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోకల్ కోర్టులో విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ మార్పు, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెంపుదల, లోపాలు ఉన్న మీటర్లు మార్చడం, నూతన సర్వీసులు మంజూరు, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, సర్వీసు పేరు మార్పు, వాడకానికి హెచ్చు మొత్తంలో గల బిల్లులు, కేటగిరీ మార్పు, సర్వీస్ రద్దు మొదలగు వాటికి సంబంధించి విద్యుత్ వినియోగదారులు తమ ఫిర్యాదులు అందించవచ్చునని తెలిపారు.ఈ ఫిర్యాదులు ఉదయం గం. 10.30 నుండి మధ్యాహ్నం గం. 1.00 వరకు స్వీకరించబడునని తెలిపారు .మల్లంపల్లి,ములుగు, వెంకటాపూర్, పసర, తాడ్వాయి సెక్షన్ పరిధి లోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
