N. Ramchander Rao Elevated Corridor Victims Protest
* అండగా ఉంటామన్న బీజేపీ
* బాధితులతో కలిసి దీక్షలో కూర్చున్న రామచంద్రరావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కార్ఖానా నుంచి అల్వాల్ వరకు ఎలివేటెడ్ కారిడార్ విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కారిడార్ వల్ల రాజీవ్ రహదారికి ఇరువైపులా చాలా మంది తమ ఆస్తులను కోల్పోతున్నారు. దీంతో వీరంతా రోడ్డెక్కారు. యాజమాన్య హక్కుల కోసం పోరాటానికి దిగారు. వీరి పోరాటానికి బీజేపీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బాధితులకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. అభివృద్ధి సరేకానీ దాని వల్ల నష్టపోతున్న వారికి కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
* అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా
బాధితుల న్యాయమైన హక్కుల పరిహారం కోరుతూ బాధితులు మంగళవారం కార్ఖానాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఎలివేటెడ్ కారీడార్ నిర్మాణ విషయంలో రాజీవ్ రహదారి ఇరువైపుల యాజమాన్య హక్కులు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తేలుకుంట సతీష్ గుప్త ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ధర్నాకు కూర్చున్న బాధితులకు భాజపా రాష్ట్ర అఽధ్యక్షుడు రామ్ చందర్ రావు దీక్షకు మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలిపారు. ఆయనతోపాటు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మద, బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక మల్లిఖార్జున్, బీజేపి మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బీఎన్ శ్రీనివాస్‌లు ఉన్నారు.
* బాధితుల సంగతి?
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో అభివృద్ధి సరే కానీ బాధితులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని రామచంద్రరావు అన్నారు. కార్ఖానా నుండి అల్వాల్ వరకు యాజమాన్య హక్కులు కోల్పోతున్న వారికి న్యాయబద్దంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న బాధితులకు భాజపా అండగా ఉంటుందని అన్నారు. ఎలివేటెడ్ కారిడార్ విషయంలో అభివృద్ధికి సహకరించి యాజమాన్య హక్కుల విషయంలో నష్టపోతున్న రాజీవ్ రహదారి బాధితుల న్యాయబద్ధమైన డిమాండ్ నేరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.
* రేవంత్‌కు లేఖ రాస్తా
ఎలివేటెడ్ కారిడార్ బాధితుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ అంశం పై లేఖ రాస్తానని రామచందర్ రావు అన్నారు. యాజమాన్య హక్కులు కోల్పోతున్న వారికి నష్టం జరగకుండ సరైన నష్టపరిహారం అందించి వారిని ఆదుకోవాలని కోరారు. యాజమాన్య హక్కులు కోల్పోతున్న బాధితులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. చేస్తూ యాజమాన్య హక్కులు కోల్పోతున్న వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ సాంస్కృతిక పాటలు ఆలపించారు. బాధిత ఐక్యత కార్యాచరణ సమితి ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
